దుర్గామాత ఆలయ నిర్మాణానికి మాజీ ఎంపీటీసీ సభ్యురాలి విరాళం.
బాన్సువాడ ప్రతినిధి వడ్ల శ్రీనివాస్ చారీ: కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం ఉమ్మడి బోర్లాం గ్రామపంచాయతీ పరిధిలోని బోర్లాం క్యాంప్‌లో నిర్మిస్తున్న శ్రీ జగదాంబ మాత దుర్గాదేవి ఆలయ నిర్మాణానికి మాజీ ఎంపీటీసీ సభ్యురాలు పెద్ద పట్లోళ్ల శ్రావణి దేవేందర్ రెడ్డి తన వంతు సహాయంగా రూ.5,100 విరాళాన్ని అందజేశారు.
మంగళవారం ఆలయ నిర్మాణ పనులకు విరాళం అందించిన అనంతరం దుర్గామాత స్వాములు, క్యాంప్ తండా పెద్దలు ఆమెను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్మాణానికి సహకరించిన శ్రావణి దేవేందర్ రెడ్డికి నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో శ్రీ జగదాంబ మాత దుర్గాదేవి ఆలయ కమిటీ నిర్వాహకులు, క్యాంప్ దుర్గామాత స్వాములు, క్యాంప్ గ్రామ పెద్దలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

