వర్ని మండలం సత్యనారాయణపురంలో విషాద ఘటన.
వర్ని ప్రతినిధి చందర్: నిజామాబాద్ జిల్లా వర్ని మండలం సత్యనారాయణపురం గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. తిమ్మాపూర్‌కు చెందిన బోగవల్లి రఘు (వ్యక్తి) పంట కాలువలో పడి మృతి చెందాడు.

పోలీసుల వివరాల ప్రకారం.. రఘు కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయి బయట జీవనం సాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో బస్టాండ్ సమీపంలోని డి-31/1 పంట కాలువలో ప్రమాదవశాత్తు పడిపోయి మృతి చెందినట్లు వెల్లడించారు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వంశీకృష్ణారెడ్డి తెలిపారు.
