ఎస్ఎస్సీ విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ చేసిన కిసాన్ కాంగ్రెస్ నేత శనిగరం కిషోర్.
వర్ని ప్రతినిధి చందర్:- నిజామాబాద్ జిల్లా వర్ని మండలం జాకోర్ గ్రామంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి 17వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాకోర్ జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో ఎస్ఎస్సీ విద్యార్థులకు కిసాన్ కాంగ్రెస్ బాన్సువాడ నియోజకవర్గ ఇన్చార్జి శనిగరం కిషోర్ స్టడీ మెటీరియల్ను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా శనిగరం కిషోర్ మాట్లాడుతూ పేదలు, రైతులు, బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం వైఎస్సార్ అనేక సంక్షేమ పథకాలను అమలు చేసి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని అన్నారు. ఆరోగ్యశ్రీ, ఉచిత విద్యుత్, రైతులకు రుణమాఫీ తదితర పథకాల ద్వారా సమాజంలోని అన్ని వర్గాల అభ్యున్నతికి ఆయన విశేష కృషి చేశారని కొనియాడారు.

వైఎస్సార్ ఆశయాలు, ప్రజాసేవా స్ఫూర్తిని కొనసాగించడమే ఆయనకు అందించే నిజమైన నివాళి అని శనిగరం కిషోర్ పేర్కొన్నారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బొడ్డొల్ల పెద్ద సాయిలు, ఉప సర్పంచ్ దస్తగిరి, పీఏసీఎస్ డైరెక్టర్ కెంపుల సాయిలు, పాఠశాల ఉపాధ్యాయులు, వార్డు సభ్యులు వర్జరీ దత్తు, నాని దత్తు, సీనియర్ నాయకులు పర్క సాయిలు, వడ్ల అనిల్, నాగేష్, గిరి దత్తు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.