శాంతియుత వాతావరణంలో గణేష్ ఉత్సవాలు నిర్వహిద్దాం: సీపీ సాయి చైతన్య.
బోధన్ ప్రతినిధి రాహుల్ : నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో గణేష్ ఉత్సవాలను శాంతియుతంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు గురువారం లైన్స్ క్లబ్ హాల్లో శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. సమావేశానికి నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా బోధన్ పట్టణంలోని గణేష్ మండపాల నిర్వాహకులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను బీజేపీ పట్టణ అధ్యక్షుడు పసుపులేటి గోపీకిషన్ సీపీ దృష్టికి తీసుకెళ్లారు. ఉత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు శాఖతో పాటు ప్రజలు, గణేష్ ఉత్సవ కమిటీలు సమన్వయంతో పనిచేయాలని సమావేశంలో చర్చించారు.

గణేష్ ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని సీపీ సాయి చైతన్య సూచించారు. అనంతరం బోధన్ కౌన్సిలర్లు, బీజేపీ పట్టణ శాఖ నాయకులు సీపీ సాయి చైతన్యను ఘనంగా సన్మానించారు.
కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, పోలీసు అధికారులు, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.