మిరాకిల్ మైండ్స్ స్కూల్‌లో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు.

మిరాకిల్ మైండ్స్ స్కూల్‌లో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు.

వర్ని ప్రతినిధి చందర్ :  నిజామాబాద్ జిల్లా వర్ని మండలం గ్రామపంచాయతీ ఎస్ఎన్ పురం గ్రామంలో మిరాకిల్ మైండ్స్ స్కూల్‌లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు శ్రీకృష్ణుడు, రాధాదేవి వేషధారణలో అలరించారు. చిన్నారుల నృత్య ప్రదర్శనలు, భక్తి గీతాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.

 

 

 

వేడుకల్లో భాగంగా నిర్వహించిన ఉట్టి కొట్టే కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని వేడుకలను సందడిగా మార్చారు. శ్రీకృష్ణుడి జీవితం, ధర్మం, సత్యం, ప్రేమ, స్నేహం వంటి విలువలను ఉపాధ్యాయులు విద్యార్థులకు వివరించారు.

పండుగల ద్వారా చిన్నారులకు భారతీయ సంస్కృతి, సంప్రదాయాలపై అవగాహన కల్పించడంతో పాటు, వారిలో సృజనాత్మకతను పెంపొందించడమే తమ లక్ష్యమని పాఠశాల యాజమాన్యం తెలిపింది. కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ బోగవల్లి వినోద్ చౌదరి ప్రిన్సిపాల్, సతీష్ ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

 

 

కృష్ణుడి వేషధారణలు, భక్తి గీతాలు, చిన్నారుల సందడితో మిరాకిల్ మైండ్స్ స్కూల్‌లో జన్మాష్టమి వేడుకలు కన్నుల పండువగా సాగాయి.