విజయ సాయి విద్యాసంస్థల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి: డీఎస్ఎఫ్ఐ డిమాండ్.

 

విజయ సాయి విద్యాసంస్థల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి: డీఎస్ఎఫ్ఐ డిమాండ్.

బాన్సువాడ ప్రతినిధి :- బాన్సువాడ పట్టణంలో అనుమతులు లేకుండా విద్యాసంస్థ నిర్వహిస్తున్న విజయ సాయి విద్యాసంస్థల యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డీఎస్ఎఫ్ఐ (డెమొక్రటిక్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా) ఉమ్మడి నిజాంబాద్ జిల్లా కమిటీ డిమాండ్ చేసింది.

 

 

ఇంటర్ బోర్డు నుంచి ఎటువంటి అనుమతి లేకపోయినా, బోధన్ పట్టణంలోని శ్రీ విజయసాయి జూనియర్ కాలేజ్ పేరుతో బాన్సువాడలో బ్రాంచ్ ప్రారంభించి అడ్మిషన్లు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు గురువారం కామారెడ్డి జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి షేక్ సలాం కు డీఎస్ఎఫ్ఐ నాయకులు వినతిపత్రం సమర్పించారు.

 

 

 

ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు జీవన్ రాథోడ్ మాట్లాడుతూ, గతంలో బుడిమి రోడ్డులో ఉన్న ఠాగూర్ జూనియర్ కాలేజ్ భవనంలో ప్రస్తుతం విజయ సాయి జూనియర్ కాలేజ్ పేరుతో అడ్మిషన్లు నిర్వహిస్తూ విద్యార్థులు, వారి తల్లిదండ్రులను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. ఇంటర్ బోర్డు నిబంధనలు పాటించకుండా, అనుమతులు లేకుండా విద్యాసంస్థ నడపడం తగదని అన్నారు.

 

 

అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోకపోతే రాష్ట్ర ఇంటర్ బోర్డు వరకు వెళ్లి జిల్లా నోడల్ అధికారిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకునేలా పోరాటం చేస్తామని హెచ్చరించారు.

 

ఈ కార్యక్రమంలో డీఎస్ఎఫ్ఐ బాన్సువాడ డివిజన్ కార్యదర్శి నహీం, సహాయ కార్యదర్శి దాసు తదితరులు పాల్గొన్నారు.