అంబేద్కర్ జయంతి సందర్భంగా బాన్సువాడలో బీజేపీ ఘన నివాళులు.

అంబేద్కర్ జయంతి సందర్భంగా బాన్సువాడలో బీజేపీ ఘన నివాళులు.

బాన్స్వాడ ప్రతినిధి :- అంబేద్కర్ జయంతి సందర్భంగా బాన్స్వాడలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఘన నివాళుల కార్యక్రమం నిర్వహించారు. భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నాయకులు ఆయనకు నివాళులు అర్పించారు.

 

 

ఈ సందర్భంగా బీజేపీ పట్టణ అధ్యక్షులు కొండల గంగారెడ్డి మాట్లాడుతూ, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం కారణంగా దేశంలో పేద, మధ్యతరగతి వర్గాలకు న్యాయం జరుగుతోందని అన్నారు. అంబేద్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ అనుసరించాలని, ఆయన అడుగుజాడల్లో నడవాలని, యువత ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

 

 

 

ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు చిదుర సాయిలు, జిల్లా కార్యదర్శి శంకర్ గౌడ్, మున్సిపల్ కౌన్సిలర్ గజ్జల మహేష్, పట్టణ ప్రధాన కార్యదర్శి ఉమేష్, నాయకులు శ్రీనివాస్, లక్ష్మీనారాయణ, చీకట్ల రాజు, కొండని గంగారం, చంద్రశేఖర్ గౌడ్, శంకర్, లక్ష్మి, మమత, భూమేష్, సాయి రెడ్డి, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.