నిజామాబాద్ ప్రతినిధి విశ్వం బార్ కుల్కర్ ని :- నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని చిక్కి క్యాంపు గ్రామంలో తెలంగాణ అమాలి యూనియన్ ఆధ్వర్యంలో మే డే సందర్భంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి బోధన్ పట్టణ సీఐ వెంకటనారాయణ, శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. గ్రామ ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొని అతిథులను ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా సీఐ వెంకటనారాయణ మాట్లాడుతూ ప్రస్తుతం ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నందున ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మధ్యాహ్న వేళల్లో బయటకు వెళ్లకుండా ఉండటం, చెట్ల నీడలో పని చేయడం, తగినంత నీరు తాగడం, తేలికపాటి ఆహారం తీసుకోవడం ద్వారా వడదెబ్బను నివారించవచ్చని తెలిపారు.
గ్రామ ప్రజల ఐక్యతతో కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. చివరగా అందరూ ఆరోగ్యంగా, సుఖసంతోషాలతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు.
