నెహ్రూ జూపార్క్ సమీపంలో స్క్రాప్ దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం.
హైదరాబాద్ బహదూర్‌పురా పోలీస్ స్టేషన్ పరిధిలోని నెహ్రూ జూపార్క్ సమీపంలో గురువారం అర్ధరాత్రి ఒక స్క్రాప్ దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ప్లాస్టిక్, రబ్బర్, పాత మెటల్ వస్తువులు ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించి దట్టమైన నల్లటి పొగ వ్యాపించింది.
అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఈ ఘటనలో ప్రాణనష్టం జరగలేదని సమాచారం, అయితే దుకాణం పూర్తిగా దగ్ధమై భారీ ఆస్తి నష్టం వాటిల్లింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది.
