పదో తరగతి ఫలితాల్లో బోడుప్పల్ నారాయణ స్కూల్‌కు శతశాతం ఉత్తీర్ణత.

పదో తరగతి ఫలితాల్లో బోడుప్పల్ నారాయణ స్కూల్‌కు శతశాతం ఉత్తీర్ణత

బోడుప్పల్ నారాయణ స్కూల్ పదో తరగతి పరీక్షా ఫలితాల్లో శతశాతం ఉత్తీర్ణత సాధించి మరోసారి తన ప్రతిభను చాటుకుంది. విద్యార్థులు అత్యుత్తమ మార్కులతో మెరిసి పాఠశాలకు గౌరవం తీసుకువచ్చారు.

 

 

అత్యధికంగా 595 మార్కులు సాధించి నారాయణగూడ బ్రాంచ్ అగ్రస్థానంలో నిలిచింది. బోడుప్పల్ బ్రాంచ్‌లో బి. చరణ్ 591 మార్కులతో మొదటి స్థానంలో నిలవగా, అనన్య 590 మార్కులతో రెండో స్థానాన్ని దక్కించుకుంది.

 

 

 

ఈ సందర్భంగా పాఠశాల ఏజీఎం బాల పరమేశ్వర్ మాట్లాడుతూ, ఈ విజయానికి కృషి చేసిన ఉపాధ్యాయులకు, అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు అభినందనలు తెలిపారు. విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రుల పట్టుదల, కృషి వల్లే ఈ ఫలితాలు సాధ్యమయ్యాయని పేర్కొన్నారు.