అంతర్జాతీయ కార్మిక దినోత్సవం నేడు – కార్మికుల పోరాటాలకు నివాళి.

అంతర్జాతీయ కార్మిక దినోత్సవం నేడు – కార్మికుల పోరాటాలకు నివాళి.

ప్రపంచ వ్యాప్తంగా కార్మికుల హక్కులు, వారి శ్రమ, త్యాగాలను స్మరించుకునే అంతర్జాతీయ కార్మిక దినోత్సవం నేడు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు, పలు ప్రైవేట్ సంస్థలకు సెలవు ప్రకటించారు.

 

 

కార్మికుల హక్కుల కోసం జరిగిన చారిత్రక పోరాటాలకు గుర్తుగా మే 1ను “మేడే”గా పాటిస్తున్నారు. 1886 మే 1న అమెరికాలోని చికాగో నగరంతో పాటు పలు ప్రాంతాల్లో లక్షలాది కార్మికులు తమ హక్కుల సాధన కోసం నిరసన చేపట్టారు. ఆందోళనల సమయంలో జరిగిన పోలీసుల కాల్పుల్లో అనేక మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు.

 

 

 

ఆ సంఘటనలను స్మరించుకుంటూ 1889 నుంచి ప్రతి సంవత్సరం మే 1న అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ రోజు కార్మిక వర్గాల ఐక్యత, హక్కుల పరిరక్షణకు ప్రతీకగా నిలుస్తోంది.