రాష్ట్ర డీజీపీగా బాధ్యతలు స్వీకరిస్తున్న సి.వి ఆనంద్‌కు గైక్వాడ్ శుభాకాంక్షలు.
బాన్సువాడ ప్రతినిధి విశ్వంభర్ కుల్కర్ ని:- తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)గా బాధ్యతలు స్వీకరిస్తున్న సందర్భంగా సి.వి ఆనంద్‌కు నిజామాబాద్ జిల్లా తరఫున రామ్‌చందర్ గైక్వాడ్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా గైక్వాడ్ మాట్లాడుతూ, సి.వి ఆనంద్ సమర్థుడు, నిజాయితీపరుడు, నిబద్ధత కలిగిన ఉన్నతాధికారిగా విశేష గుర్తింపు పొందారని పేర్కొన్నారు. గతంలో నిజామాబాద్ జిల్లా ఎస్పీగా పనిచేసిన సమయంలో ప్రజల సమస్యలను శ్రద్ధగా విని, అమాయకులకు న్యాయం అందించారని గుర్తుచేశారు.
జర్నలిస్టులకు గౌరవం ఇవ్వడంలోనూ, సామాన్య ప్రజల పట్ల సానుభూతితో వ్యవహరించడంలోనూ ఆయన ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారని అన్నారు. పోలీసు సేవలో ఆయన చూపిన అంకితభావం రాష్ట్రానికి ఆదర్శమని కొనియాడారు.
సి.వి ఆనంద్ డీజీపీగా బాధ్యతలు చేపట్టడం రాష్ట్ర ప్రజలకు మేలు చేస్తుందని, ఆయన నాయకత్వంలో ప్రజలకు మరింత సమగ్ర న్యాయం అందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ శుభాకాంక్షలను ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు, దళిత కళ్యాణ్ సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి, సామాజిక కార్యకర్త రామ్‌చందర్ గైక్వాడ్ తెలిపారు.
