బీసీ అభివృద్ధి సలహాదారుగా నియామకం.. వి. హనుమంతరావుకు సన్మానం.

 

హైదరాబాద్ ప్రతినిధి గౌరవ్ బీడ్కర్:- తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీ అభివృద్ధి సలహాదారుగా నియమించిన వి. హనుమంతరావును రాష్ట్ర జూనియర్ కాలేజ్ ఫిజికల్ డైరెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ బొమ్మరబోయిన లక్ష్మయ్య సన్మానించారు.

 

 

ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మయ్య మాట్లాడుతూ, బీసీ వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ప్రశంసనీయమని పేర్కొన్నారు. వి. హనుమంతరావు అనుభవం, సేవా దృక్పథం రాష్ట్రంలోని బీసీ వర్గాల అభివృద్ధికి దోహదపడుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

 

 

హనుమంతరావు కొత్త బాధ్యతల్లో విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సన్మాన కార్యక్రమం స్నేహపూర్వక వాతావరణంలో జరిగింది.