బోధన్‌లో ‘ఉల్లాస్ – అమ్మకు అక్షరమాల’ శిక్షణ కార్యక్రమం నిర్వహణ.

బోధన్‌లో ‘ఉల్లాస్ – అమ్మకు అక్షరమాల’ శిక్షణ కార్యక్రమం నిర్వహణ.

నిజామాబాద్ జిల్లా (బోధన్ ప్రతినిధి రాహుల్): బోధన్ పట్టణంలోని మహిళా సమాఖ్య మెప్మా కార్యాలయంలో ‘ఉల్లాస్ – అమ్మకు అక్షరమాల’ వయోజన విద్య కార్యక్రమంపై అవగాహన మరియు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళా సమాఖ్య సభ్యులు, మెప్మా ఆర్‌పీలకు సీఆర్‌పీలు అనురాధ, వనిత శిక్షణ అందించారు.

 

 

 

అడల్ట్ ఎడ్యుకేషన్ జిల్లా కో-ఆర్డినేటర్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, “చదువుకు వయస్సుతో సంబంధం లేదు. అక్షరాస్యత లేని ప్రతి మహిళను అక్షరాస్యురాలిగా తీర్చిదిద్దడమే ‘ఉల్లాస్’ ప్రధాన లక్ష్యం” అని తెలిపారు. సంఘాల్లోని తల్లులు, వయోజన మహిళలు తమ పేరు రాయడం, సంతకం చేయడం, ప్రాథమిక గణితం నేర్చుకునేలా ఈ కార్యక్రమం రూపొందించబడిందని వివరించారు.

సీఆర్‌పీలు అనురాధ, వనిత వయోజన విద్య ప్రాముఖ్యతను వివరిస్తూ, సమాజ అభివృద్ధికి అక్షరాస్యత ఎంత అవసరమో వివరించారు. ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న వంద శాతం అక్షరాస్యత సాధనలో మహిళా సమాఖ్య సభ్యులు కీలక పాత్ర పోషించాలని కోరారు.

 

 

ఈ కార్యక్రమంలో మహిళా సమాఖ్య ఆదాధికారులు, ఆర్‌పీలు, మెప్మా టీఎంసీ శ్రీనివాస్, సీఓ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. తమ పరిధిలోని నిరక్షరాస్య మహిళలందరినీ విద్యావంతులుగా మార్చేందుకు కృషి చేస్తామని సభ్యులు ప్రతిజ్ఞ చేశారు.