అఖండ శివనామ సప్తాహంలో 50 కిలోల భోగం విరాళం.
నిజామాబాద్ జిల్లా (బోధన్ ప్రతినిధి రాహుల్): నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని శ్రీ ఏక చక్రేశ్వర శివాలయంలో నిర్వహిస్తున్న 21వ అఖండ శివనామ సప్తాహ మహోత్సవాలు భక్తి శ్రద్ధలతో వైభవంగా కొనసాగుతున్నాయి. ఆలయ ప్రాంగణం “ఓం నమః శివాయ” నినాదాలతో మార్మోగుతూ ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది.
ఈ పుణ్య సందర్భంగా వీరశైవ సమాజ్ భజన మండలి, బోధన్ తరఫున శ్రీ చక్రేశ్వర స్వామివారికి 50 కిలోల భోగాన్ని విరాళంగా సమర్పించారు. భోగాన్ని ఆలయ కమిటీకి అప్పగిస్తూ, భక్తులకు ప్రసాదంగా పంపిణీ చేయాలని కోరారు.
భజన మండలి సభ్యులు శివనామ స్మరణతో భజనలు నిర్వహించగా, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అఖండ శివనామ జపం, పూజలు, సేవా కార్యక్రమాలు భక్తి పారవశ్యంతో నిరంతరం కొనసాగుతున్నాయి.
ఆలయ కమిటీ సభ్యులు భోగం విరాళం అందించిన వీరశైవ సమాజ్ భజన మండలి సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు మరింత విస్తరించాలని, శివుని అనుగ్రహం అందరికీ కలగాలని భక్తులు ప్రార్థించారు.
