బక్రీద్‌ను శాంతి సామరస్యాలతో జరుపుకోవాలి : సీపీ పిలుపు.
బోధన్ ప్రతినిధి రాహుల్ :- బోధన్ పట్టణంలో జరగనున్న బక్రీద్ పండుగను ప్రజలు శాంతి, సామరస్య వాతావరణంలో ఆనందంగా జరుపుకోవాలని కమిషనర్ ఆఫ్ పోలీస్ సూచించారు. పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరూ చట్టాలు, ప్రభుత్వ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని కోరారు.
బహిరంగ ప్రదేశాల్లో జంతువుల బలి నిర్వహించకుండా, ప్రజలకు అసౌకర్యం కలగకుండా పరిశుభ్రతను కాపాడాలని తెలిపారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా వాహనాలను క్రమబద్ధంగా పార్క్ చేయాలని సూచించారు.
సోషల్ మీడియాలో అపోహలు, రెచ్చగొట్టే పోస్టులు, అసత్య ప్రచారాలను షేర్ చేయకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని హెచ్చరించారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు కనిపిస్తే వెంటనే సమీప పోలీసులకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.
“ప్రజలు పోలీసులకు సహకరిస్తే బక్రీద్ వేడుకలు ప్రశాంతంగా, సుఖశాంతులతో జరుగుతాయి. పరస్పర గౌరవం, సోదరభావంతో పండుగను జరుపుకోవాలి” అని సీపీ పేర్కొన్నారు.
