ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ పంపిణీ.
వర్ని మండలం ప్రతినిధి చందర్ :- మండలంలోని సత్యనారాయణపురం గ్రామపంచాయతీ పరిధిలోని కోటయ్య క్యాంప్ అటవీ ప్రాంతంలో పనిచేస్తున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ కూలీలకు శుక్రవారం మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని సర్పంచ్ కనకదుర్గ రవి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు.
ఈ కార్యక్రమంలో గ్రామ వార్డు సభ్యులు శంకర్, ఉపాధి హామీ మేట్లు అశోక్, బుజ్జిబాబు, బలరామ్, విఠల్ తదితరులు పాల్గొన్నారు. గ్రామ ప్రజలు కూడా కార్యక్రమానికి హాజరై సహకరించారు.
