లయన్స్ క్లబ్ రీజినల్ అవార్డుల వేడుక ఘనంగా నిర్వహణ.
సేవా కార్యక్రమాల్లో విశేష కృషికి అధికారులకు పురస్కారాలు
నిజామాబాద్ జిల్లా బోధన్ ప్రతినిధి రాహుల్ :- బోధన్ పట్టణంలో లయన్స్ క్లబ్ ఆఫ్ అయ్యప్ప సేవ ఆధ్వర్యంలో రీజినల్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం వైభవంగా జరిగింది. సమాజ సేవ, ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో విశేష సేవలు అందిస్తున్న అధికారులను లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ప్రత్యేక అవార్డులతో సత్కరించింది.
ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణ, సీడీపీఓ డి. పద్మ, తహసీల్దార్ పి. విట్టల్‌లకు అవార్డులు అందజేశారు. లయన్స్ క్లబ్ మాజీ జిల్లా గవర్నర్ ఎల్.ఎన్.పీ. బసవేశ్వరరావు చేతుల మీదుగా సత్కార కార్యక్రమం నిర్వహించారు.
కార్యక్రమంలో మాట్లాడిన బసవేశ్వరరావు, బోధన్ అయ్యప్ప సేవ క్లబ్ సామాజిక సేవలో ముందుండి ప్రజలకు ఆదర్శంగా నిలుస్తోందని ప్రశంసించారు. సమాజ అభివృద్ధికి సేవా సంస్థలు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు.

ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు కుమ్మరి పోశెట్టి, కార్యదర్శి ఎంజేఎఫ్ లయన్ సురాబత్తుని శ్రీనివాసరావు, కే. సత్యనారాయణతో పాటు పలువురు క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.
