రామంతాపూర్‌లో నిర్లక్ష్యంగా విద్యుత్ పోల్ ఏర్పాటు.
హైదరాబాద్ రామంతపూర్ ప్రతినిధి :- రామంతాపూర్‌లోని సాయి కృష్ణ నగర్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన విద్యుత్ సిమెంట్ పోల్ పనుల్లో నిర్లక్ష్యం వెలుగుచూసింది. సరైన సిమెంట్, కాంక్రీట్ ఉపయోగించకపోవడం, గుంతను తగిన లోతులో తవ్వకపోవడంతో పోల్ పగిలిపోయిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.
పనుల సమయంలో ఇంజనీర్ లేదా కాంట్రాక్టర్ పర్యవేక్షణ లేకపోయిందని వారు తెలిపారు. వెంటనే అధికారులు స్పందించి నాణ్యమైన పనులు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
