700 ఏళ్ల చరిత్ర గల బడా పహాడ్ దర్గా – భక్తులతో కళకళలాడుతున్న పుణ్యక్షేత్రం.
వర్ని ప్రతినిధి చందర్: నిజామాబాద్ జిల్లా వర్ని మండలంలోని బడా పహాడ్ దర్గా తెలంగాణలోనే ప్రముఖ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రంగా విశేష ఖ్యాతి గాంచిందని వక్ఫ్ బోర్డు డిప్యూటీ సూపరింటెండెంట్ షేక్ జమీన్ తెలిపారు. ఆదివారం దర్గా ప్రాంగణంలో ఆయన మాట్లాడుతూ, హజరత్ సయ్యద్ షాదుల్లా హుస్సేన్ బాబా బడా పహాడ్ దర్గాకు దాదాపు 700 ఏళ్ల చారిత్రక నేపథ్యం ఉందని పేర్కొన్నారు.

తెలంగాణతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాల నుంచి వేలాదిగా భక్తులు దర్గాకు చేరుకుని దర్శనం చేసుకుంటున్నారని తెలిపారు. హజరత్ సయ్యద్ షాదుల్లా హుస్సేన్ బాబా ఆశీస్సులతో తమ కోరికలు నెరవేరుతున్నాయని, మొక్కులు తీరుతున్నాయని భక్తులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారని అన్నారు.
దర్గాకు వచ్చే భక్తులకు తాగునీరు, విశ్రాంతి సదుపాయాలు, పారిశుధ్యం, విద్యుత్ వంటి మౌలిక వసతులను కల్పిస్తున్నామని అధికారులు వెల్లడించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో వక్ఫ్ బోర్డు అధికారులు, దర్గా కమిటీ సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు.
