నకిలీ వాట్సాప్ నంబర్‌పై మల్కాజిగిరి పోలీసుల హెచ్చరిక.
మల్కాజిగిరి ప్రతినిధి :- మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ ప్రజలకు కీలక హెచ్చరిక జారీ చేసింది. కమిషనర్ సుమతి ఐపీఎస్ పేరుతో 82397 14091 నంబర్ ఉపయోగించి నకిలీ వాట్సాప్ అకౌంట్ సృష్టించి మోసాలకు పాల్పడే ప్రయత్నాలు జరుగుతున్నట్లు గుర్తించారు.

ప్రజలు ఆ అకౌంట్‌ను అధికారికంగా భావించి ఎలాంటి ఆర్థిక లావాదేవీలు చేయవద్దని పోలీసులు సూచించారు. అనుమానాస్పద కాల్స్, మెసేజ్‌లు వస్తే వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930 లేదా స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.

