విద్యార్థి చదువుకు అండగా ఎన్నారై శశాంక్.. రూ.30 వేల ఫీజు చెల్లింపు.

విద్యార్థి చదువుకు అండగా ఎన్నారై శశాంక్.. రూ.30 వేల ఫీజు చెల్లింపు.

వర్ని మండలానికి చెందిన ఆరో తరగతి విద్యార్థి యశ్వంత్ సాయికి కోనేరు శశాంక్ చారిటబుల్ ట్రస్ట్ చేయూత.

వర్ని ప్రతినిధి చందర్:- బాన్సువాడ నియోజకవర్గంలోని వర్ని మండలానికి చెందిన ఓ నిరుపేద విద్యార్థి చదువుకు కోనేరు శశాంక్ చారిటబుల్ ట్రస్ట్ అండగా నిలిచింది. బావరిశెట్టి దుర్గాప్రసాద్, దుర్గాదేవి దంపతుల కుమారుడు యశ్వంత్ సాయి మల్లారెడ్డి మెమోరియల్ స్కూల్‌లో ఆరో తరగతి చదువుతున్నాడు. కుటుంబ ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో అతని విద్యాభ్యాసం కొనసాగించడం కష్టంగా మారింది.

 

 

ఈ విషయాన్ని తెలుసుకున్న ఎన్నారై కోనేరు శశాంక్ స్పందించి, యశ్వంత్ సాయి ఒక సంవత్సరం స్కూల్ ఫీజు మరియు పుస్తకాల ఖర్చుల కోసం మొత్తం రూ.30 వేల ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ మొత్తాన్ని నేరుగా మల్లారెడ్డి మెమోరియల్ స్కూల్ యాజమాన్యానికి చెల్లించి, సంబంధిత రసీదును కుటుంబ సభ్యులకు అందజేశారు.

 

 

 

ఈ సందర్భంగా ట్రస్ట్ ప్రతినిధులు మాట్లాడుతూ, విద్యార్థుల విద్యాభివృద్ధికి తమ వంతు సహాయ సహకారాలు కొనసాగిస్తామని తెలిపారు. భవిష్యత్తులో కూడా యశ్వంత్ సాయి కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

 

 

ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు రెడ్డి వినోద్, వెంకటేష్, తాళ్లూరి సంతోష్, ఆలపాటి హరికృష్ణ, వివేకానంద ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సంతోష్, జాస్తి అనిల్, వినయ్ తదితరులు పాల్గొన్నారు.