భవానిపేటలో ఘనంగా సామూహిక అక్షరాభ్యాసం.

భవానిపేటలో ఘనంగా సామూహిక అక్షరాభ్యాసం.

ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో విద్యార్థులకు అక్షరాభ్యాసం – ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని ఎంఈఓ నాగయ్య పిలుపు.

బోధన్ ప్రతినిధి రాహుల్‌: నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం భవానిపేట గ్రామంలోని మండల ప్రాథమిక పాఠశాలలో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఒకటో తరగతి విద్యార్థులకు సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

 

 

 

ఈ సందర్భంగా మండల విద్యాధికారి (ఎంఈఓ) నాగయ్య మాట్లాడుతూ, గత విద్యా సంవత్సరంలో ప్రారంభమైన ఈ పాఠశాలలో 28 మంది విద్యార్థులు విద్యను అభ్యసించగా, ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఇప్పటికే 15 మంది కొత్తగా చేరడం ఆనందదాయకమని తెలిపారు. ప్రధానోపాధ్యాయుడు కార్తీక్, ఉపాధ్యాయ బృందం, గ్రామస్తులు, యువకులు, తల్లిదండ్రుల సమిష్టి కృషితో పాఠశాల అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని పేర్కొన్నారు.

ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి గ్రామ ప్రజలు అందిస్తున్న సహకారం అభినందనీయమని, విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పాఠశాలలను ఆదరించి బలోపేతం చేయాలని ఆయన కోరారు. విద్యా రంగంలో సేవలందిస్తున్న ఉపాధ్యాయులను ప్రశంసిస్తూ, విద్యార్థులు, తల్లిదండ్రులు, గ్రామస్తులకు అభినందనలు తెలిపారు.

కార్యక్రమంలో పెంటకుర్దు కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు రత్నాకర్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కార్తీక్, సీఆర్‌పీ విజయ్, గ్రామ ఇన్‌చార్జ్ సర్పంచ్ లింగారం, ఉపాధ్యాయినులు మౌనిక, కీర్తి, గ్రామ యువకులు భూమేష్, రాజు, కృష్ణ, గ్రామస్తులు లక్ష్మయ్య, కిషోర్, మొగులయ్య తదితరులు, విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.