బోధన్ మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యుల ఎన్నికలు పూర్తి.

బోధన్ మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యుల ఎన్నికలు పూర్తి.

కలెక్టర్ పర్యవేక్షణలో పారదర్శకంగా ప్రక్రియ – నాలుగు పదవులకు ఏకగ్రీవంగా సభ్యుల ఎన్నిక.

బోధన్ ప్రతినిధి రాహుల్‌:-  బోధన్ మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక ప్రక్రియ మంగళవారం కట్టుదిట్టమైన భద్రత మధ్య ప్రశాంతంగా ముగిసింది. బోధన్ మున్సిపల్ కార్యాలయంలో జరిగిన ప్రత్యేక సమావేశాన్ని కలెక్టర్ ఇలా త్రిపాఠి పర్యవేక్షించారు. ఎక్స్ అఫిషియో సభ్యుడిగా ప్రభుత్వ సలహాదారు, స్థానిక ఎమ్మెల్యే పి. సుదర్శన్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించారు.

 

 

మొత్తం 39 మంది సభ్యులకుగాను అన్ని సభ్యులు హాజరయ్యారు. కోరం నిర్ధారణ అనంతరం చేతులు ఎత్తే విధానంలో ఎన్నిక ప్రక్రియ కొనసాగింది. ఈ సందర్భంగా 12 మంది ఎంఐఎం కౌన్సిలర్లు ఎన్నికను బహిష్కరించి సమావేశం నుంచి వాకౌట్ చేశారు.

నాలుగు కో-ఆప్షన్ స్థానాలకు 35 దరఖాస్తులు అందగా, 19 మంది సభ్యుల మద్దతుతో దండు సంగ్రామ్, మాసుల లక్ష్మి, మహమ్మద్ ఇమ్రాన్, రఫీయా బేగం కో-ఆప్షన్ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నిక ప్రక్రియ వీడియో రికార్డింగ్ మధ్య పూర్తిగా పారదర్శకంగా నిర్వహించబడింది.

 

 

 

ఫలితాలను ప్రిసైడింగ్ ఆఫీసర్ జాదవ్ కృష్ణ అధికారికంగా ప్రకటించారు. అనంతరం నూతనంగా ఎన్నికైన సభ్యులకు నియామక ధృవీకరణ పత్రాలు అందజేశారు.‌ ఈ సందర్భంగా మున్సిపల్ కార్యాలయం వద్ద గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. నూతన సభ్యులకు ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ ఇలా త్రిపాఠి అభినందనలు తెలిపారు.

 

 

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వి. భుజంగరావు, బోధన్ ఆర్డీఓ విజయలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణ, తహసీల్దార్ విఠల్, వార్డు కౌన్సిలర్లు పాల్గొన్నారు.