ఆర్టీసీ కార్గో సేవలు పునరుద్ధరించాలని బీజేపీ వినతి.

ఆర్టీసీ కార్గో సేవలు పునరుద్ధరించాలని బీజేపీ వినతి.

బాన్సువాడ ప్రతినిధి విశ్వంభర్ :- 

బాన్సువాడ పట్టణంతో పాటు పరిసర ప్రాంత ప్రజలకు ఆర్టీసీ కార్గో సేవలను తిరిగి ప్రారంభించాలని కోరుతూ బీజేపీ నాయకులు మంగళవారం ఆర్టీసీ డిపో మేనేజర్‌కు వినతిపత్రం అందజేశారు.

 

 

 

ఈ సందర్భంగా బీజేపీ పట్టణ అధ్యక్షుడు కోనాల గంగారెడ్డి మాట్లాడుతూ, గతంలో బాన్సువాడలో పనిచేసిన ఆర్టీసీ కార్గో కేంద్రం ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉండేదని తెలిపారు. ప్రస్తుతం ఆ సేవలు నిలిపివేయడంతో పార్సిళ్లు పంపడం, స్వీకరించడంలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన పేర్కొన్నారు. వెంటనే కార్గో కేంద్రాన్ని పునరుద్ధరించి సేవలను తిరిగి ప్రారంభించాలని ఆయన డిపో మేనేజర్ రవి కుమార్‌ను కోరారు.

 

 

 

ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి, మాజీ అసెంబ్లీ కన్వీనర్ గుడుగుట్ల శ్రీనివాస్, పట్టణ ప్రధాన కార్యదర్శి ఉమేష్, జిల్లా కౌన్సిలర్ ప్రసాద్, చీకట్ల రాజు, మాజీ మండల అధ్యక్షులు సాయి బాబా, నాయకులు మహేందర్, కొండని గంగారం, శంకర్, ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.