వర్నిలో ఘనంగా పోచారం భాస్కర్ రెడ్డి జన్మదిన వేడుకలు.

వర్నిలో ఘనంగా పోచారం భాస్కర్ రెడ్డి జన్మదిన వేడుకలు.

వర్ని ప్రతినిధి చందర్: నిజామాబాద్ జిల్లా వర్ని మండలంలోని సత్యనారాయణపురం గ్రామంలో సుభాష్ చంద్రబోస్ చౌరస్తా వద్ద నిజామాబాద్ జిల్లా మాజీ డీసీసీబీ చైర్మన్, బాన్సువాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి పోచారం భాస్కర్ రెడ్డి జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు.

 

 

 

ఈ సందర్భంగా పోచారం భాస్కర్ రెడ్డిని భారీ పైనాపిల్ గజమాలతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ ఆయన ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు జీవించాలని, ప్రజలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తూ ప్రజాసేవలో మరింత కాలం కొనసాగాలని ఆకాంక్షించారు.

అనంతరం కేక్ కట్ చేసి ఒకరికి ఒకరు తినిపించుకుంటూ జన్మదిన వేడుకలను ఆనందంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అలాగే “జై పి.పీ.బి.ఆర్.” నినాదాలతో సుభాష్ చంద్రబోస్ చౌరస్తా మార్మోగింది.

 

 

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని పోచారం భాస్కర్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.