కోటయ్య క్యాంప్‌లో హరితహారం.. గ్రామస్థులకు మొక్కల పంపిణీ.

కోటయ్య క్యాంప్‌లో హరితహారం.. గ్రామస్థులకు మొక్కల పంపిణీ.

వర్ని ప్రతినిధి చందర్ :- 

నిజామాబాద్ జిల్లా వర్ని మండలం సత్యనారాయణపురం గ్రామపంచాయతీ పరిధిలోని కోటయ్య క్యాంప్ గ్రామంలో శుక్రవారం హరితహారం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ కనకదుర్గ రవి ఆధ్వర్యంలో గ్రామస్థులకు మొక్కలను పంపిణీ చేశారు.

 

 

 

ఈ సందర్భంగా సర్పంచ్ కనకదుర్గ రవి మాట్లాడుతూ, “పచ్చదనమే ప్రగతికి పునాది” అని పేర్కొన్నారు. గ్రామంలోని ప్రతి ఇంటికి ఐదు మొక్కలు అందజేస్తున్నామని, ప్రతి కుటుంబం వాటిని నాటి సంరక్షించి గ్రామాన్ని పచ్చని వాతావరణంతో తీర్చిదిద్దేందుకు సహకరించాలని కోరారు. ప్రకృతిని ప్రేమించడం, పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని అన్నారు. హరితహారం ద్వారా గ్రామంలో పచ్చదనాన్ని పెంపొందించి, భావితరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.

 

 

ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి నాగరాజు, 9వ వార్డు సభ్యుడు పంతం శంకర్, ఉపాధి హామీ ఏపీవో హేమలత, ఈసీ అరుణ్, టీఏ వినోద్ కుమార్, ఉపాధి హామీ మేట్లు సంగోల్ల అశోక్, టి. సాయిలు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.