బాన్సువాడలో ప్రజా సమస్యలు తెలుసుకున్న ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి.

బాన్సువాడలో ప్రజా సమస్యలు తెలుసుకున్న ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి.

బాన్సువాడ ప్రతినిధి షేక్ అమైర్ :

బాన్సువాడ పట్టణంలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు వివిధ కాలనీల్లో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇళ్లు లేని అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసి అందిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తన దృష్టికి తీసుకురావాలని, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

 

 

ఈ పర్యటనలో ఆర్డీఓ రవీందర్ రెడ్డి, తహసీల్దార్ రాజా నరేందర్ గౌడ్, కౌన్సిలర్లు ఏజెస్, హకీమ్, రుక్మిణి, స్థానిక ప్రజలు మరియు పలువురు అధికారులు పాల్గొన్నారు.