దుర్గామాత ఆశీస్సులతో ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలి.
రంగారెడ్డి ప్రతినిధి వినోద్: శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా తొమ్మిదో రోజు సందర్భంగా తెలంగాణ రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ నాయకుడు చల్లా నరసింహారెడ్డి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. దుర్గామాత దివ్య ఆశీస్సులతో ప్రతి ఒక్కరికీ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖసంతోషాలు కలగాలని ఆకాంక్షించారు.
అమ్మవారి కృపతో ప్రతి కుటుంబంలో సుఖశాంతులు, సిరిసంపదలు వెల్లివిరియాలని, ప్రజలు చేపట్టే ప్రతి పనిలో విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు. దుర్గామాత ఆశీస్సులు ఎల్లప్పుడూ ప్రజలందరిపై ఉండాలని, సమాజంలో శాంతి, ఐక్యత, సౌభ్రాతృత్వం వెల్లివిరియాలని ఆకాంక్షించారు.
ఈ పవిత్ర శరన్నవరాత్రి వేడుకలను భక్తిశ్రద్ధలతో జరుపుకుంటూ అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరుతూ, “జై మాతా దీ.. జై దుర్గామాత” అంటూ ప్రజలకు మరోసారి శుభాకాంక్షలు తెలియజేశారు.
