బుగ్గ రామలింగేశ్వర స్వామి జాతర ఏర్పాట్లు, ఆలయ అభివృద్ధిపై ఎమ్మెల్యేకు వినతి.

మంచాల మండల కాంగ్రెస్ నాయకులతో ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి భేటీ.

రంగారెడ్డి ప్రతినిధి వినోద్: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం మంచాల మండలం ఆరుట్ల గ్రామంలో జరగనున్న శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి జాతర ఏర్పాట్లు, ఆలయ అభివృద్ధి పనులపై కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డిని కలిశారు.

 

 

మంచాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు ఎమ్మెల్యే నివాసానికి వెళ్లి ఆలయం వద్ద చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, జాతరకు అవసరమైన ఏర్పాట్ల గురించి వివరించారు. జాతరకు పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున భక్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పించడం, ఆలయ పరిసరాలను అభివృద్ధి చేయడం వంటి అంశాలపై దృష్టి సారించాలని నాయకులు కోరారు.

 

 

జాతరను సజావుగా నిర్వహించేందుకు సంబంధిత ఏర్పాట్లపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మంచాల సహకార సంఘం డైరెక్టర్ దేంగే వెంకటేష్ యాదవ్, జిల్లా నాయకుడు బి. రమాకాంత్ రెడ్డి, ఆరుట్ల మాజీ సర్పంచ్ యాదయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు గుడిమల్ల చంద్రయ్య ముదిరాజ్, మారగోని మైసయ్య గౌడ్, పంబాల శివకుమార్, బత్తుల రాజు గౌడ్, పడాల శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.