పిడిఎస్ బియ్యంపై సీసీఎస్ టీమ్ మెరుపు దాడి – 450 క్వింటాళ్ల బియ్యం స్వాధీనం.
నిజామాబాద్ ప్రతినిధి :- నిజామాబాద్ జిల్లాలో పిడిఎస్ (పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్) బియ్యం అక్రమ రవాణాపై పోలీసులు కఠిన చర్యలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ పి. సాయి చైతన్య, IPS గారి ఆదేశాల మేరకు సీసీఎస్ (CCS) టీమ్ మెరుపు దాడి నిర్వహించింది.
సీసీఎస్ ఏసీపీ ఇన్చార్జ్ మస్తాన్ వాలి సార్ ఆధ్వర్యంలో సిబ్బంది బోధన్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పాగిడేపల్లి గ్రామంలో తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలలో శ్రీ రాఘవేంద్ర బిన్నీ రైస్ మిల్ వద్ద భారీగా నిల్వ ఉంచిన పిడిఎస్ బియ్యాన్ని గుర్తించారు.
ఈ దాడిలో సుమారు 450 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా టాటా ఏప్ ఆటో (నంబర్ TS16T 0397) ను కూడా పోలీసులు పట్టుకున్నారు.
స్వాధీనం చేసుకున్న బియ్యం మరియు వాహనాన్ని తదుపరి చర్యల కోసం బోధన్ రూరల్ పోలీస్ స్టేషన్ SHOకు అప్పగించారు. పిడిఎస్ బియ్యం అక్రమ రవాణాపై కఠిన చర్యలు కొనసాగుతాయని పోలీసులు హెచ్చరించారు.
