శోక సముద్రంలో దావు కుటుంబం – దావు లింగుభాయి కన్నుమూత

శోక సముద్రంలో దావు కుటుంబం – దావు లింగుభాయి కన్నుమూత.

నిజామాబాద్ జిల్లా బాసర గ్రామానికి చెందిన దావు కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. దావు పండరి మాతృమూర్తి దావు లింగుభాయి అర్ధరాత్రి అనారోగ్యంతో కన్నుమూశారు.

 

కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం, ఆమె కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఉండగా, పరిస్థితి విషమించడంతో మృతిచెందారు. ఆమె మృతి కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్థులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది.
దావు లింగుభాయి అంత్యక్రియలు ఈరోజు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు ఒక ప్రకటనలో తెలిపారు.

 

 

సమాజంలో మంచిపేరు పొందిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) ప్రతినిధి దావు పండరికి తల్లి దూరం కావడం అందరినీ కలచివేసింది. పలువురు ప్రముఖులు, గ్రామస్థులు కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తున్నారు.