యువత, తల్లిదండ్రులకు సైబర్ నేరాలు, పోక్సో చట్టంపై అవగాహన.
జల్పల్లి ప్రతినిధి : పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీరామ్ కాలనీలో యువత మరియు తల్లిదండ్రులకు సైబర్ నేరాలు, పోక్సో చట్టంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎస్సై లక్ష్మణ్, ఏఎస్ఐ నరసింహ మాట్లాడుతూ యువత సామాజిక బాధ్యతతో వ్యవహరించాలని, సైబర్ నేరాల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆన్లైన్లో అధిక సమయం గడపకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, అనుమానాస్పద లింకులు, సందేశాలకు స్పందించవద్దని తెలిపారు.
అలాగే తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనపై నిరంతరం నిఘా ఉంచాలని, చిన్నారులకు వాహనాలు ఇవ్వకూడదని, సమాజంలో జరుగుతున్న మంచి-చెడు విషయాలపై అవగాహన కల్పించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో ఎస్సై లక్ష్మణ్, ఏఎస్ఐ నరసింహ, పీసీ నరేష్, పీసీ బిచ్చయ్య నాయక్తో పాటు యువత, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
