సత్తుపల్లి ఎమ్మెల్యే చేతుల మీదుగా LOC చెక్కుల పంపిణీ.

సత్తుపల్లి ఎమ్మెల్యే చేతుల మీదుగా LOC చెక్కుల పంపిణీ.

సత్తుపల్లి ప్రతినిధి ఉపేంద్ర :-  సత్తుపల్లి నియోజకవర్గ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) ద్వారా మంజూరైన లెటర్ ఆఫ్ క్రెడిట్ (ఎల్ఓసీ) చెక్కులను ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ సోమవారం సత్తుపల్లి క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు అందజేశారు.

 

 

ఈ సందర్భంగా పెనుబల్లి మండలం భావన్నపాలెం గ్రామానికి చెందిన పాశం అజయ్ కుమార్‌కు రూ.1.25 లక్షలు, తల్లాడ మండలం తల్లాడ గ్రామానికి చెందిన కొత్తగుండ్ల పద్మావతికి రూ.2.40 లక్షలు, కల్లూరు మండలం ఖాన్ఖాన్‌పేట గ్రామానికి చెందిన సయ్యద్ హమీదున్‌కు రూ.3 లక్షల విలువైన ఎల్ఓసీ చెక్కులను ఎమ్మెల్యే అందించారు.

ఈ నిధుల ద్వారా హైదరాబాద్‌లోని Nizam’s Institute of Medical Sciencesలో అవసరమైన వైద్య చికిత్స పొందేందుకు అవకాశం కలుగుతుందని ఎమ్మెల్యే తెలిపారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు వైద్య ఖర్చుల భారం తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా నిరంతరం అండగా నిలుస్తోందన్నారు.

 

 

అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందేలా కృషి చేస్తున్నామని, ప్రజల ఆరోగ్య భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ పేర్కొన్నారు.

ఎల్ఓసీ మంజూరుకు సహకరించిన ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేకు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు.