హుంసా గ్రామంలో ఎమ్మెల్యే పి. సుదర్శన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా.
సాలూరు ప్రతినిధి రాహుల్ : నిజామాబాద్ జిల్లా సాలూరు మండలం హుంసా గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు, బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరి పి. సుదర్శన్ రెడ్డి జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు.
మండల కాంగ్రెస్ అధ్యక్షుడు రవి, బోధన్ వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) చైర్మన్ చీల శంకర్, గ్రామ సర్పంచ్ శివకుమార్ ఆధ్వర్యంలో గ్రామంలోని సోమేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని ప్రార్థించారు. అనంతరం కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఏఎంసీ చైర్మన్ చీల శంకర్ తన సొంత ఖర్చులతో గ్రామ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నోట్ పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి రైతులు, విద్యార్థుల సంక్షేమానికి ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇస్తారని, అదే స్ఫూర్తితో దుబారా ఖర్చులు చేయకుండా విద్యార్థులకు ఉపయోగపడే విధంగా నోట్ పుస్తకాలను అందజేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
