కొయ్యగుట్ట ICDS బాలవాటికలో విద్యార్థులకు యూనిఫాం, పోషకాహార పంపిణీ.

కొయ్యగుట్ట ICDS బాలవాటికలో విద్యార్థులకు యూనిఫాం, పోషకాహార పంపిణీ.

బాన్సువాడ ప్రతినిధి షేక్ అమైర్:

కామారెడ్డి జిల్లా బాన్సువాడ మున్సిపల్ 3వ వార్డు పరిధిలోని కొయ్యగుట్ట ప్రభుత్వ ICDS బాలవాటిక అంగన్వాడీ స్కూల్‌లో విద్యార్థులకు కొత్త స్కూల్ యూనిఫాంలు మరియు పోషకాహారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం 3వ వార్డు కౌన్సిలర్ శ్రీ ఏం ఏయే హకీమ్ గారు, స్కూల్ టీచర్ ఇమ్రానా మేడమ్ గారి సమక్షంలో జరిగింది.

 

 

 

ఈ సందర్భంగా వార్డు కౌన్సిలర్ హకీమ్ గారు మాట్లాడుతూ, ప్రభుత్వం పేద కుటుంబాల పిల్లలకు విద్యతో పాటు పోషకాహారం అందిస్తోందని తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలను అంగన్వాడీ బాలవాటికల్లో చేర్పించాలని ఆయన కోరారు. అలాగే గర్భిణీ స్త్రీలు, బాలింత మహిళలకు ఐసిడిఎస్ కేంద్రాల ద్వారా అవసరమైన పోషకాహారం అందిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కోయగుట్ట ప్రాంత మహిళలు, విద్యార్థులు పాల్గొన్నారు.