నిజాం షుగర్స్ రక్షణ కమిటీ కన్వీనర్ ఉప్పునూతల రాఘవులు గారికి 8వ వర్థంతి నివాళులు.

నిజాం షుగర్స్ రక్షణ కమిటీ కన్వీనర్ ఉప్పునూతల రాఘవులు గారికి 8వ వర్థంతి నివాళులు.

బోధన్ ప్రతినిధి రాహుల్ : నిజాం షుగర్స్ రక్షణ కమిటీ కన్వీనర్ ఉప్పునూతల రాఘవులు గారి 8వ వర్థంతి సందర్భంగా తేది: 9-7-2026 గురువారం రోజున బోధన్ . పి ఆర్ టి యు ,భవన్ వద్ద ఆయన చిత్రపటానికి పూలదండ వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి మానవ హక్కుల వేదిక జిల్లా అధ్యక్షులు గడ్డం గంగులు అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా వామపక్ష పార్టీల నాయకులు, ఎన్ డిఎస్ఎల్ , కార్మిక నాయకులు మాట్లాడుతూ రాఘవులు గారు నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెలంగాణ ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ప్రభుత్వ రంగంలోనే నడపాలని డిమాండ్ చేస్తూ బోధన్ కేంద్రంగా అనేక ఉద్యమాలు నడిపారని తెలిపారు. కేసులు, నిర్బంధాలను ఎదుర్కొన్నారని పేర్కొన్నారు.

2015 నుండి 2019 వరకు బోధన్ కేంద్రంగా వివిధ రూపాల్లో ఆందోళనలు, ధర్నాలు, దీక్షలు నిర్వహించారని గుర్తు చేశారు. అయినప్పటి కీ ప్రభుత్వాలు నిజాం షుగర్ ఫ్యాక్టరీ విషయంలో బోధన్ ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాన్ని నిలబెట్టు కోవడం లేదని విమర్శించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఫ్యాక్టరీ విషయంలో కాలయాపన చేసి మోసం చేసిందని, నేడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే దారిలో నడుస్తుందని ఆరోపించారు.

 

 

 

8బోధన్ ప్రాంతంలో షుగర్ ఫ్యాక్టరీ మూతపడటం వల్ల కార్మికులు రోడ్డున పడ్డారని, జీతాలు లేక అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బోధన్ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే పరిశ్రమలు ఈ ప్రాంతంలో లేకపోవడం, నాయకులు కూడా పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేయకపోవడం దురదృష్టకరమని అన్నారు.

 

ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం కమిటీల పేరుతో కాలయాపన చేయకుండా నిజాం షుగర్ ఫ్యాక్టరీని పునరుద్ధరించి ప్రభుత్వ రంగంలోనే నడపాలని, పెండింగ్‌లో ఉన్న కార్మికుల వేతన బకాయిలను తక్షణం చెల్లించాలని డిమాండ్ చేశారు.

 

ఈ కార్యక్రమంలో వామపక్ష పార్టీల నేతలు శంకర్ గౌడ్, వరదయ్య, ఏషాల గంగాధర్, దాల్ మల్క పోశెట్టి, ఫ్యాక్టరీ కార్మిక నాయకులు ఉపేందర్, శ్రీనివాస్ లతోపాటు విద్యార్థి సంఘాల నాయకులు నాగరాజు, సంజయ్, మోసిన్, గైని రాములు తదితరులు పాల్గొన్నారు.