బోధన్ వీడీసీ అధ్యక్షుడు గంగాధర్ రావు పట్వారి జన్మదిన వేడుకలు ఘనంగా.

బోధన్ వీడీసీ అధ్యక్షుడు గంగాధర్ రావు పట్వారి జన్మదిన వేడుకలు ఘనంగా.

బోధన్ ప్రతినిధి రాహుల్‌: బోధన్ పట్టణ వీడీసీ అధ్యక్షుడు గంగాధర్ రావు పట్వారి జన్మదిన వేడుకలు శుక్రవారం పాన్ గల్లీ, హరిజనవాడ, రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని శ్రీ పెద్ద పోచమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, గంగాధర్ రావు పట్వారి ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, దీర్ఘాయుష్షుతో ప్రజాసేవలో మరింత ముందుకు సాగాలని భక్తులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

 

 

అనంతరం గంగాధర్ రావు పట్వారిని శాలువాతో ఘనంగా సన్మానించి, పూలమాలలు వేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేస్తూ వేడుకలను ఆనందోత్సాహాల మధ్య నిర్వహించారు. పలువురు ప్రజాప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు, కాలనీవాసులు ఆయన సేవలను కొనియాడుతూ భవిష్యత్తులోనూ ప్రజలకు మరింత సేవ చేయాలని ఆకాంక్షించారు.

 

ఈ కార్యక్రమంలో శ్రీ మహాలక్ష్మీ ట్రస్ట్ పట్టణ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు గంగాధర్ రావు పట్వారి, వీడీసీ ప్రధాన కార్యదర్శి బీర్కూర్ శంకర్ (బుజ్జి), కోశాధికారి గామారపేట శ్రీను, మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యుడు దండు సంగ్రామ్, మారుతి మందిరం చైర్మన్ గుండెడి శంకర్, ఎంబెల్లి గంగారాం, సింధీ విజయ్, రజక సంఘం అధ్యక్షుడు మల్లెపూల నడిపి గంగారాం తదితరులు పాల్గొన్నారు. కాలనీవాసులు పెద్ద సంఖ్యలో హాజరై గంగాధర్ రావు పట్వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి, కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.