జిల్లా చెస్ ఛాంపియన్‌గా గౌరంగ అశోక్ – రాష్ట్ర స్థాయికి అర్హత.

జిల్లా చెస్ ఛాంపియన్‌గా గౌరంగ అశోక్ – రాష్ట్ర స్థాయికి అర్హత.

బోధన్ ప్రతినిధి రాహుల్: బోధన్‌కు చెందిన సాయి సామల చెస్ అకాడమీ మరోసారి జిల్లాలో తన ప్రతిభను చాటుకుంది. అకాడమీ విద్యార్థి గౌరంగ అశోక్ ఇటీవల నిర్వహించిన నిజామాబాద్ జిల్లా అండర్-13 బాలుర చెస్ ఛాంపియన్‌షిప్-2026లో అద్భుతమైన ప్రతిభ కనబర్చి జిల్లా ఛాంపియన్‌గా నిలిచి ప్రథమ స్థానం సాధించాడు. ఈ విజయంతో గౌరంగ అశోక్ తెలంగాణ రాష్ట్ర అండర్-13 చెస్ ఛాంపియన్‌షిప్-2026లో పాల్గొనే అర్హతను పొందాడు. రాష్ట్ర స్థాయి పోటీలు ఆగస్టు 6 నుంచి 8 వరకు హైదరాబాద్‌లో జరగనున్నాయి.

 

 

ఈ సందర్భంగా సాయి సామల చెస్ అకాడమీ వ్యవస్థాపకులు, ప్రధాన కోచ్ సాయిబాబా సామల మాట్లాడుతూ, గౌరంగ అశోక్ విజయం అతని క్రమశిక్షణ, నిరంతర సాధన, ఏకాగ్రత, కృషికి నిదర్శనమని అన్నారు. అకాడమీలో ప్రతి విద్యార్థికి టోర్నమెంట్ ఆధారిత ప్రణాళికాబద్ధమైన శిక్షణ అందిస్తున్నామని, రాష్ట్ర స్థాయిలోనూ అత్యుత్తమ ప్రతిభ కనబర్చి జాతీయ స్థాయికి అర్హత సాధించాలని ఆకాంక్షించారు. అలాగే విద్యార్థుల విజయాల్లో తల్లిదండ్రుల ప్రోత్సాహం కీలకమని పేర్కొంటూ, గౌరంగ అశోక్ తల్లిదండ్రులను అభినందించారు.

సాయి సామల చెస్ అకాడమీ బోధన్‌లో ప్రారంభ స్థాయి నుంచి టోర్నమెంట్ స్థాయి వరకు ప్రత్యేక శిక్షణ అందిస్తూ, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రతిభావంతులైన చెస్ క్రీడాకారులను తీర్చిదిద్దే లక్ష్యంతో ముందుకు సాగుతోంది.