గ్రామ అభివృద్ధికి సర్పంచ్ కనకదుర్గ రవి ప్రత్యేక చర్యలు.

గ్రామ అభివృద్ధికి సర్పంచ్ కనకదుర్గ రవి ప్రత్యేక చర్యలు.

వర్ని ప్రతినిధి చందర్ :  గ్రామాన్ని పరిశుభ్రంగా, ఆరోగ్యవంతంగా, అభివృద్ధి చెందిన ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు వర్ని గ్రామ సర్పంచ్ కనకదుర్గ రవి ఆధ్వర్యంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. గ్రామంలో ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు, ప్రతి ఇంటికి హరితహారం మొక్కలను పంపిణీ చేస్తున్నారు. ఆటో ద్వారా ఇంటింటికీ చెత్తను సేకరిస్తూ తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించే విధానాన్ని అమలు చేస్తున్నారు.

 

 

 

గ్రామంలోని సీసీ రోడ్లు, డ్రైనేజీలు, ధ్వంసమైన కల్వర్టుల నిర్మాణ, మరమ్మతు పనులకు ప్రాధాన్యం ఇస్తున్నారు. పాఠశాలల్లో పచ్చదనం, పరిశుభ్రతను పెంపొందించే చర్యలు చేపడుతున్నారు. అలాగే 100 శాతం ఇంటి పన్ను వసూళ్లకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు ప్రబలకుండా గ్రామమంతటా దోమల నివారణ మందులను పిచికారీ చేయిస్తున్నారు. పిచ్చి మొక్కల నివారణకు వ్యవసాయ శాఖ, వైద్య నిపుణుల సూచనల మేరకు మందులు పిచికారీ చేస్తున్నారు.

గ్రామ పరిశుభ్రత, ప్రజారోగ్య పరిరక్షణ, మౌలిక వసతుల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తూ వర్ని గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు సర్పంచ్ కనకదుర్గ రవి చేస్తున్న చర్యలను గ్రామస్థులు అభినందిస్తున్నారు.