సమాచార హక్కు చట్టం అవగాహన పుస్తకాన్ని ఆవిష్కరించిన బిక్కనూరు ఎస్సై అనిల్ కుమార్.

సమాచార హక్కు చట్టం అవగాహన పుస్తకాన్ని ఆవిష్కరించిన బిక్కనూరు ఎస్సై అనిల్ కుమార్.

బిక్కనూరు ప్రతినిధి వడ్ల శ్రీనివాస్ చారి : కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌లో సమాచార హక్కు చట్టం–2005పై అవగాహన కల్పించే పుస్తకం, కరపత్రాన్ని గురువారం బిక్కనూరు ఎస్సై అనిల్ కుమార్ ఆవిష్కరించారు.

 

 

 

ఈ సందర్భంగా ఎస్సై అనిల్ కుమార్ మాట్లాడుతూ.. సమాచార హక్కు చట్టం–2005పై మండలంలోని వివిధ గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలను చైతన్యపరుస్తున్న సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ రాష్ట్ర డైరెక్టర్ ఎం.ఏ. సలీంను అభినందించారు. ప్రజలకు తమ హక్కులు, చట్టంపై అవగాహన కల్పించడం అభినందనీయమని అన్నారు.

కార్యక్రమంలో పాల్గొన్న సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ తెలంగాణ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు శ్రీమతి అందేలా భవాని రెడ్డి మాట్లాడుతూ.. సమాచార హక్కు చట్టం పేద, సామాన్య ప్రజలకు ఒక వజ్రాయుధం లాంటిదని అన్నారు. ప్రతి భారతీయ పౌరుడు ప్రభుత్వ శాఖల నుంచి తనకు అవసరమైన సమాచారాన్ని పొందేందుకు ఆర్టీఐ చట్టంలోని సెక్షన్‌ 6(1) కింద దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.

 

 

దరఖాస్తు చేసుకున్న అనంతరం సాధారణంగా 30 రోజులలోపు సమాచారం అందించాల్సి ఉంటుందని వివరించారు. నిర్ణీత గడువులో సమాచారం అందకపోతే చట్టంలోని అప్పీల్‌ నిబంధనల ప్రకారం తదుపరి చర్యలు తీసుకోవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి టౌన్ సెక్రటరీ ఏ. రవికుమార్, కామారెడ్డి జిల్లా సలహాదారు శ్రీనివాసరావు, ఏ. సాయికుమార్, పోలీస్ సిబ్బంది, సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.