జాకోర క్రాస్‌రోడ్డులో కమాన్ నిర్మాణం నిలిపివేయాలి.
ఎండల లక్ష్మీనారాయణ డిమాండ్.
వర్ని ప్రతినిధి చందర్: నిజామాబాద్ జిల్లా వర్ని మండలంలోని జాకోర క్రాస్‌రోడ్డు వద్ద ఆర్అండ్బీ రోడ్డు పరిధిలో చేపడుతున్న స్వాగత తోరణం (కమాన్) నిర్మాణాన్ని వెంటనే నిలిపివేయాలని మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు.
ఈ మేరకు శుక్రవారం వర్ని తహసీల్దార్ ప్రశాంత్‌కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎండల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఆర్అండ్బీ రోడ్డు పరిధిలో సంబంధిత అనుమతులు లేకుండా కమాన్ నిర్మాణం ఎలా చేపడుతున్నారని ప్రశ్నించారు. కమాన్ నిర్మాణం పూర్తయితే ప్రజలకు, వాహనదారులకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని పేర్కొన్నారు.
అధికారులు వెంటనే స్పందించి నిర్మాణ పనులను నిలిపివేసి, నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. కార్యక్రమంలో వర్ని మండల నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
