కొత్తపెళ్లి పంచాయతీ సిబ్బందికి దసరా కానుకలు.

రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలోని కొత్తపెళ్లి గ్రామపంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో దసరా పండుగను పురస్కరించుకుని పంచాయతీ సిబ్బందికి నూతన పట్టు వస్త్రాలు, నిత్యావసర సరుకులను పండుగ కానుకలుగా అందజేశారు. ఈ సందర్భంగా సిబ్బందికి దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ, గ్రామ పరిశుభ్రత, ప్రజలకు సేవలు అందించడం, గ్రామాభివృద్ధి కార్యక్రమాల అమలులో వారు చేస్తున్న కృషిని పాలకవర్గం అభినందించింది. గ్రామ అభివృద్ధిలో సిబ్బంది పాత్ర కీలకమని, వారి సేవలను గుర్తించి గౌరవించడం తమ బాధ్యతని పేర్కొన్నారు.

 

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చిక్కుడు వెన్నెల శేఖర్, ఉపసర్పంచ్ కాలే అనిత రమేష్, వార్డు సభ్యులు తలారి సత్యనారాయణ, వంగ సంజీవరెడ్డి, పోలే శివ, కంబాలపల్లి కుమార్, చిక్కుడు పావని వెంకటేష్, మహేశ్వరం సంతోష్, వినోద్, సోమరాజు, అరవింద్, కొండారెడ్డి, రాజు, గ్రామపంచాయతీ కార్యదర్శి ప్రశాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.