సిరత్-ఉన్-నబీ వేడుకల్లో పాల్గొన్న మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన మహేశ్వరం ఎమ్మెల్యే

రంగారెడ్డి ప్రతినిధి వినోద్: బడంగ్‌పేట్ సర్కిల్ 16 ముస్లిం మైనారిటీల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రెండో సిరత్-ఉన్-నబీ వేడుకలు, బహుమతుల పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

 

 

ఆదివారం బాలాపూర్‌లోని హాల్ యాసీన్ కాలనీ, గణేష్ చౌక్ సమీపంలోని టీ.వై. రాయల్ ప్యాలెస్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి మహేశ్వరం ఎమ్మెల్యే, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వివిధ పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి ఆమె బహుమతులు ప్రదానం చేశారు.

 

 

మహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవిత విశేషాలు, బోధనలను స్మరించుకుంటూ ఈ వేడుకలను నిర్వహించారు. ప్రేమ, శాంతి, సోదరభావం, మానవత్వం వంటి గొప్ప విలువలను సమాజంలో విస్తరింపజేయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. యువతలో సత్ప్రవర్తన, సేవాభావం, సామాజిక బాధ్యతను పెంపొందించడంతో పాటు అన్ని వర్గాల మధ్య ఐక్యతను బలోపేతం చేయడానికి ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని పేర్కొన్నారు.

 

 

ఈ కార్యక్రమంలో బీ-16 ముస్లిం మైనారిటీల సంక్షేమ సంఘం కోర్ కమిటీ అధ్యక్షుడు షరీఫ్ అబ్దుల్ యామిని సాహెబ్, వర్కింగ్ ప్రెసిడెంట్ మామ అఖిల్, ఉపాధ్యక్షుడు రఫీక్ మామ సాహెబ్, ప్రధాన కార్యదర్శి అఫ్జల్, సంయుక్త కార్యదర్శులు మహమ్మద్ అన్వర్ జియా సాహెబ్, మహమ్మద్ ఫైజావుద్దీన్ సాహెబ్, కోశాధికారులు జమీల్ అహ్మద్ సాహెబ్ తదితర కమిటీ సభ్యులు, ముస్లిం మైనారిటీ నాయకులు, స్థానికులు పాల్గొన్నారు.