కామారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా విశ్వాంబర్ కులకర్ణి నియామకం.

కామారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా విశ్వాంబర్ కులకర్ణి నియామకం.

కామారెడ్డి ప్రతినిధి :- పురోగామి పాత్రికేయ సంఘం (భారత్) తెలంగాణ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా విశ్వాంబర్ కులకర్ణిని నియమించారు. ఈ మేరకు 2026 ఏప్రిల్ 19న తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గజానన్ బిడ్కర్ నియామక పత్రాన్ని జారీ చేశారు.

 

 

సంఘం బలోపేతానికి, పాత్రికేయుల హక్కుల పరిరక్షణకు ఆయన కృషి చేస్తారనే నమ్మకంతో ఈ బాధ్యతలను అప్పగించినట్లు సంఘ ప్రతినిధులు తెలిపారు.

 

 

 

ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి గౌరవ్ బిడ్కర్ కూడా సంతకం చేసి అభినందనలు తెలిపారు. కొత్త బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి, సంఘాన్ని మరింత బలోపేతం చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

 

నియామకానికి స్పందించిన విశ్వాంబర్ కులకర్ణి, సంఘ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ పాత్రికేయుల సంక్షేమం కోసం కృషి చేస్తానని తెలిపారు.