డిగ్లూర్–కామారెడ్డి మధ్య టీజీఎస్ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్ బస్సు సేవలు ప్రారంభం.
కామారెడ్డి ప్రతినిధి :- సరిహద్దు ప్రాంతాల ప్రయాణికులకు ఊరట కలిగిస్తూ కామారెడ్డి డిపో ఆధ్వర్యంలో దేగలూరు–కామారెడ్డి ఎక్స్‌ప్రెస్ బస్సు సేవలు ప్రారంభమయ్యాయి. ఈ బస్సులు ప్రతిరోజూ రెండు సార్లు నడుస్తున్నాయి. ఉదయం 6.00 గంటలకు, మధ్యాహ్నం 2.30 గంటలకు దేగలూరు నుంచి బయలుదేరి మద్నూర్, బిచ్కుంద, పిట్లం, నిజాంసాగర్, ఎల్లారెడ్డి మీదుగా కామారెడ్డికి చేరుకుంటాయి. ఉదయం బస్సు 9.00 గంటలకు, మధ్యాహ్నం బస్సు సాయంత్రం 6.00 గంటలకు కామారెడ్డి చివరి బస్టాండ్‌కు చేరుతుంది.
అలాగే కామారెడ్డి నుంచి దేగలూరు వరకు ప్రతిరోజూ ఉదయం 11.00 గంటలకు, సాయంత్రం 6.00 గంటలకు ఎక్స్‌ప్రెస్ బస్సులు బయలుదేరి ఎల్లారెడ్డి, నిజాంసాగర్, పిట్లం, బిచ్కుంద, మద్నూర్ మీదుగా దేగలూరుకు చేరుకుంటాయి. ఉదయం బయలుదేరే బస్సు మధ్యాహ్నం 2.00 గంటలకు, సాయంత్రం బయలుదేరే బస్సు రాత్రి 9.00 గంటలకు దేగలూరు చేరుతుంది.
ఇదే కాకుండా ప్రయాణికుల సౌకర్యార్థం దేగలూరు–బాన్స్వాడ పల్లెవెలుగు బస్సు సేవ కూడా ప్రతిరోజూ తెల్లవారుజామున 4.00 గంటలకు ప్రారంభమై మద్నూర్, బిచ్కుంద, వాజిద్నగర్ మీదుగా ఉదయం 6.20 గంటలకు బాన్స్‌వాడకు చేరుకుంటోంది.
గతంలో ఈ బస్సు సేవలు తరచూ నిలిపివేయబడటంతో రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ విషయాన్ని సామాజిక కార్యకర్తలు, జర్నలిస్టులు కామారెడ్డి డిపో అధికారుల దృష్టికి తీసుకెళ్లి, బస్సు సేవలను శాశ్వతంగా కొనసాగించాలని పలుమార్లు విజ్ఞప్తి చేశారు. వారి విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న డిపో అధికారులు సేవలను పునరుద్ధరించి, గత నెల రోజులుగా క్రమబద్ధంగా నిర్వహిస్తున్నారు.
ఈ బస్సు సేవలను ప్రయాణికులు వినియోగించుకోవాలని అధికారులు సూచించారు.
