చందూర్ సొసైటీలో వరి ధాన్యం కొనుగోలు విజయవంతం రైతుల ఖాతాల్లో నగదు జమ కావడంతో సీఎం, మంత్రుల చిత్రపటాలకు పాలాభిషేకం.
చందూర్ మండల ప్రతినిధి చందర్: చందూర్ మండల ప్రాథమిక సహకార సంఘం (పీఏసీఎస్) ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ విజయవంతంగా పూర్తయ్యింది. రైతుల బ్యాంక్ ఖాతాల్లో ధాన్యం కొనుగోలు నగదు జమ కావడంతో సొసైటీ ప్రాంగణంలో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి.
ఈ సందర్భంగా పీఏసీఎస్ చైర్మన్ ప్యారం అశోక్ యాదవ్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించి నాయకులు, రైతులు హర్షం వ్యక్తం చేశారు. రైతులకు సకాలంలో చెల్లింపులు జరగడం ప్రభుత్వ రైతు సంక్షేమానికి నిదర్శనమని చైర్మన్ ప్యారం అశోక్ యాదవ్ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కర్లం సాయిరెడ్డి, మాజీ ఎంపీపీ లావణ్య రాంరెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పోతరాజు శ్రీనివాస్, ఉప సర్పంచ్ దాకడి సురేఖ సాయిలు, ప్యాక్స్ సెక్రటరీ ఆరిఫ్, ప్యాక్స్ డైరెక్టర్ మాదరపు రుక్మిణి రాంరెడ్డి, మేడిపల్లి సాయిలు, వార్డు సభ్యులు బ్యాంకు సాయిలు, సైదులు, మద్దూరి రాజిరెడ్డి, యానం లక్ష్మణ్, జి. పెద్దసాయిలు, వై. సాయిలు, అర్కల రాజిరెడ్డి, ఎడ్ల ప్రవీణ్, కరెంగా సాయిలు తదితరులతో పాటు పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.
