ప్రమాదకర మలుపుల వద్ద సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని డిమాండ్.

ప్రమాదకర మలుపుల వద్ద సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని డిమాండ్.

వర్ని ప్రతినిధి చందర్ :- నిజామాబాద్ జిల్లా వర్ని మండలంలోని సత్యనారాయణపురం నుంచి కోటయ్య క్యాంప్‌కు వెళ్లే ప్రధాన రహదారిపై ఉన్న ప్రమాదకర మలుపులు వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ రహదారిలోని కొన్ని మలుపులు అత్యంత ప్రమాదకరంగా ఉండటంతో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని గ్రామస్తులు తెలిపారు.

 

 

సత్యనారాయణపురం నుంచి కోటయ్య క్యాంప్‌తో పాటు పరిసర గ్రామాలకు వెళ్లే వాహనదారులు ఈ మార్గాన్ని అధికంగా వినియోగిస్తున్నారని, అయితే మలుపుల వద్ద హెచ్చరిక సూచికలు లేకపోవడం వల్ల ప్రమాదాలు సంభవిస్తున్నాయని పేర్కొన్నారు.

 

 

ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ప్రమాదకర మలుపుల వద్ద హెచ్చరిక బోర్డులు, రిఫ్లెక్టర్ సూచికలు ఏర్పాటు చేసి రహదారి భద్రతను మెరుగుపరచాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ప్రమాదాలు జరగకముందే తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.