కామారెడ్డిలో బాల్య వివాహాలు, మానవ అక్రమ రవాణాపై అవగాహన కార్యక్రమం.
కామారెడ్డి ప్రతినిధి : మహిళలు, పిల్లల సంరక్షణ సామాజిక బాధ్యతపై అవగాహన పెంపొందించేందుకు కామారెడ్డి మహిళా సమాఖ్య భవన్‌లో శనివారం విస్తృత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం జిల్లా సెషన్స్ జడ్జి వరప్రసాద్, జిల్లా న్యాయ సేవా సంస్థ జడ్జి నాగరాణి ఆధ్వర్యంలో జరిగింది.
మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో బాల్య వివాహాల నిర్మూలన, మానవ అక్రమ రవాణా నివారణ, మహిళలు మరియు పిల్లల భద్రత వంటి అంశాలపై అవగాహన కల్పించారు. జిల్లా APM శ్రీనివాస్‌తో పాటు వివిధ గ్రామాల నుంచి వచ్చిన ఐకేపీ మహిళా సంఘాల అధ్యక్షులు, సభ్యులు పాల్గొన్నారు.

కామారెడ్డి జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ శ్రీ ఎం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ ఆదేశాల మేరకు పోలీస్ కళాబృందం ఇన్‌చార్జి హెడ్ కానిస్టేబుల్ రామంచ తిరుపతి, హెడ్ కానిస్టేబుల్ యు. శేషారావు, పీసీలు ప్రభాకర్, సాయిలు పాటలు, నాటికల ద్వారా బాల్య వివాహాల దుష్పరిణామాలు, మానవ అక్రమ రవాణా ప్రమాదాలపై వివరించారు.
ఈ కార్యక్రమంలో ఇన్‌స్పెక్టర్ రామన్, AHTU పీసీ రాజేందర్, కామారెడ్డి షీ టీమ్ సభ్యులు WPC సౌజన్య, పీసీ భూమయ్య, DLSA సిబ్బంది పాల్గొని మహిళలకు చట్టపరమైన హక్కులు, రక్షణ చర్యలపై అవగాహన కల్పించారు. మహిళలు, బాలల రక్షణ కోసం సమాజం బాధ్యతాయుతంగా ముందుకు రావాలని అధికారులు పిలుపునిచ్చారు.

