వడ్డెర కార్పొరేషన్ వైస్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన బత్తుల వెంకటేష్‌కు ఘన అభినందనలు.
సిద్దిపేట ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర వడ్డెర కార్పొరేషన్ వైస్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన బత్తుల వెంకటేష్‌ను ప్రముఖ సామాజిక కార్యకర్త, కంటెస్టెడ్ ఎమ్మెల్సీ పిడిశెట్టి రాజు సోమవారం కొండాపూర్ గ్రామంలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి హార్దిక అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా శాలువా, పుష్పగుచ్ఛంతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా పిడిశెట్టి రాజు మాట్లాడుతూ, బత్తుల వెంకటేష్ బడుగు బలహీన వర్గాలు, కార్మికుల అభ్యున్నతికి అంకితభావంతో పనిచేస్తూ మండలానికి, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఆయన నియామకానికి సహకరించిన స్థానిక శాసనసభ్యులు, మంత్రి పొన్నం ప్రభాకర్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

వడ్డెర కార్పొరేషన్ ద్వారా సామాజికంగా వెనుకబడిన వర్గాల అభివృద్ధికి మరింత కృషి చేసి సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలని ఈ సందర్భంగా కోరారు.
ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం నాయకులు, వడ్డెర సోదరులు, స్థానిక ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.
